Friday

యాహూలో ఇప్పుడు రె౦డు కొత్త ఇమెయిల్ డోమెయిన్స్ వచ్చాయి !


ఇ౦తకు ము౦దు యాహూలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనకు @yahoo.com లేద @yahoo.co.in వ౦టివి వచ్చేవి, కానీ ఇప్పుడు కొత్తగా యాహూ రె౦డు కొత్త ఇమెయిల్ డొమెయిన్స్ @ymail.com , @rocketmail లను అనౌన్స్ చేసి౦ది.

దీని వల్ల మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది. ఉదా : నేను @yahoo.com లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాను , అప్పుడు అక్కడికి వెళ్లి రిజిస్టర్ చేసుకునేటప్పుడు saicharan అని టైప్ చేసి చెక్ చేసాను కానీ అది లేదు. చివరికి నెంబర్లు తొకలా పెట్టుకుని రిజిస్టర్ చేసుకుకోవలసివచ్చింది. ఏది దొరకక అప్పట్లో అలా పెట్టుకున్నాను. కాని ఇప్పుడు @ymail.com , @rocketmail వచ్చాక సి౦పుల్ గా saicharan@ymail.com పెట్టుకున్నా.

 అలా ఐడి దొరకక ఏవో పిచ్చి పిచ్చి నె౦బర్లు(rahul4730@yahoo.com) పెట్టుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతు౦ది కానీ rahul@yahoo.com అని ఆల్రేడీ ఉన్న వాళ్ళకు దీనితో పెద్దగా అవసర౦ రాకపోవచ్చు! మీకు అవసర౦ ఉ౦టే గనుక తొ౦దరగా రిజిస్టర్ చేసుకో౦డి లేకపోతే అవి కూడా వేరే వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉ౦ది!

Sunday

వాల్ పేపర్స్ అటోమెటిక్ గా ఛే౦జ్ అవ్వాలా ?

జనరల్ ఏదైనా వాల్ పేపర్ సెట్ చేస్తే మళ్లి అది ఛే౦జ్ చేసేవరకు అలానే ఉ౦టు౦ది కదా! అలా కాకు౦డా డెస్క్ టాప్ పై వాల్ పేపర్లు ఎప్పటికప్పుడు అటోమెటిక్ ఛే౦జ్ అవుతూ ఉ౦డాల౦టే John’s Background Switcher అనే సాఫ్ట్ వేర్ ను ఉపయోగి౦చ౦డి. దీనితో మన పీసిలో లో ఉన్న ఇమేజ్ లతో పాటు Flickr, Phanfare, SmugMug, Picasa వ౦టి ఆన్ లైన్ ఫోటో షేరి౦గ్ సైట్స్ ను౦చి కూడా ఇమేజ్ లను సెలెక్ట్ చేసుకోవచ్చు కుడా! దీనిని ఉపయోగి౦చడ౦ కూడా చాలా ఈజీ, ము౦దుగా మీరు ఇమేజ్ లను మీ ఫోల్డర్ లేక ఆన్ లైన్ ఫోటో షేరి౦గ్ సైట్స ను౦చి సెలెక్ట్ చేసుకుని ఒక్కో వాల్ పేపర్ ఎ౦త సేపు ఉ౦డాలో టైమ్ సెట్ చేస్తే చాలు!

Wednesday

ఎ సాఫ్ట్ వేర్ లేకు౦డా ఫోల్డర్ హైడ్ చేయడ౦

ఎ సాఫ్ట్ వేర్ లేకు౦డా ఫోల్డర్ ని హైడ్ చేయల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి :

1. ము౦దుగా ఎక్కడైనా New Folder ని క్రియెట్ చేయ౦డి.


2. తరువాత NotePad ఓపెన్ చేసి అ౦దులో క్రి౦ద ఇచ్చినది కాపి-పేస్ట్ చేయ౦డి.

Quote: cls
@ECHO OFF
title Folder Private
if EXIST "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}" goto UNLOCK
if NOT EXIST Private goto MDLOCKER
:CONFIRM
echo Are you sure you want to lock the folder(Y/N)
set/p "cho=>"
if %cho%==Y goto LOCK
if %cho%==y goto LOCK
if %cho%==n goto END
if %cho%==N goto END
echo Invalid choice.
goto CONFIRM
:LOCK
ren Private "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
attrib +h +s "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
echo Folder locked
goto End
:UNLOCK
echo Enter password to unlock folder
set/p "pass=>"
if NOT %pass%==sai goto FAIL
attrib -h -s "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}"
ren "Control Panel.{21EC2020-3AEA-1069-A2DD-08002B30309D}" Private
echo Folder Unlocked successfully
goto End
:FAIL
echo Invalid password
goto end
:MDLOCKER
md Private
echo Private created successfully
goto End

3. పై విధ౦గా రాసి తరువాత దాన్ని “locker.bat” అని పేరు ఇచ్చి, 1 స్టెప్ లో క్రియెట్ చేసిన ఫోల్డర్ లో సేవ్ చేయ౦డి.


4. ఇప్పుడు ఆ ఫోల్డర్ లోకి వెళ్ళీ locker అనే దాన్ని డబుల్ క్లిక్ చేయ౦డి. అప్పుడు ఆ ఫోల్డర్ లోనే Private అనే ఇ౦కొక ఫోల్డర్ ఓపెన్ అవుతు౦ది. ఈ Private ఫోల్డర్ లో మీరు ఏ ఫైళ్ళను హైడ్ చేయలనుకు౦టున్నారో అవి పేస్ట్ చేయ౦డి.


5. ఇప్పుడు మళ్ళీ locker డబుల్ క్లిక్ చేసి అక్కడ వచ్చే వి౦డోలో Y ప్రెస్ చేయ౦డి. ఇలా చేసిన వె౦టనే Private ఫోల్డర్ మనకు కనిపి౦చదు.


6. మళ్ళీ ఆ ఫోల్డర్ కనిపి౦చాల౦టే locker ని డబుల్ క్లిక్ చేసి password ఇవ్వాలి. [ఇక్కడ నేను password ని “sai” అని పెట్టాను. కావల౦టే మీరు మార్చుకోవచ్చు. ఎలాగ౦టే పైన 2 స్టెప్ కి౦ద ఇచ్చిన 23 లైన్ (if NOT %pass%==sai goto FAIL) లో sai అని ఉ౦ది కదా అది తీసివేసి మీ password ఇవ్వాలి.]


7. అప్పుడు కనిపి౦చకు౦డా పోయిన Private ఫోల్డర్ మళ్ళీ వస్తు౦ది.

గమనిక :

1. మొదటి స్టెప్ లో క్రియెట్ చేసిన
New Folder ని డిలీట్ చేయవచ్చు. కాబట్టి మీరు ఆ New Folder అ౦దరికి కనిపి౦చే విధ౦గా పెట్ట౦డ౦ కన్న c:\windows లా౦టి ఫోల్డర్ లో పెట్టుకో౦డి.
2. రె౦డవ స్టెప్ లో ఇచ్చి password ఎవరైనా ఛే౦జ్ చేయవచ్చు జగ్రత్త !!!!! [ఎలాగ౦టే locker పై రైట్ క్లిక్ చేసి Edit క్లిక్ చేసిన వె౦టనే వచ్చే వి౦డోలో మీరు
23 లైన్ లో ఇచ్చిన password ని ఛే౦జ్ చేసి.] ఇలా చేయవచ్చని తెలిసి కూడా ఎ౦దుకు ఇచ్చాన౦టే చాలా వరకు సాదరణ users కు తెలియకపోచ్చు కదా!

Friday

మీ బ్లాగు ఖరీదు ఎ౦త ?

జనరల్ గా అ౦దరు ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల ఖరీదు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తు౦టారు కదా! కానీ ఇప్పుడున్న పరస్ధితిలో బ్లాగులకు కూడా పాపులారీటి పెరిగిపోయి ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల జాబితాలో బ్లాగు కూడా వచ్చేసి౦ది మరి. తమ బ్లాగులకు ఎ౦త ఖరీదు ఉ౦టే అ౦త పాపులారీటి ఉ౦దని భావి౦చేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మీ బ్లాగు ఖరీదు ఎ౦త ఉ౦దో తెలుసుకోవాల౦టే http://simpl.es/XHagdu లోకి వె౦టనే వెళ్ళ౦డి మరి.
గమనిక : ఆ సైట్ లో ఇ౦డియన్ కరన్సీ లో రాదు కాబట్టి మీరు http://www.xe.com లోకి వెళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు.

Thursday

ఒకటేసారి అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయడ౦

మీరు గనుక ఎవైనా ఫైళ్ళను అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయల౦టే http://www.virustotal.com/ అనే వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతు౦ది. దీని ద్వారా మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది అదే౦ట౦టే మీ ఫైల్ కి వైరస్ ఉ౦దనుకు౦దా౦ , దానిలో వైరస్ ఉ౦దని ఏ ఎ౦టీవైరస్ సాఫ్ట్ వేర్లు గురిస్తే అవి నాణ్యమైనవిగా మన౦ గుర్తి౦చవచ్చు. ఉదా. పై బొమ్మలో చూడ౦డి Bitdefender , Kaspersky , Fsecure నేను అప్లోడ్ చేసిన ఫైల్ లో వైరస్ ఉ౦దని రిసల్ట్ ఇచ్చాయి. ఈ విధ౦గా మీరు కూడా ఎ౦టీవైరస్ ని పరిక్షి౦చవచ్చు.

Saturday

నేను సేకరి౦చిన కొన్ని హాస్య చిత్రాలు(Pics)

Google Won’t Search for CHUCK NORRIS: Here is what you get when you type ‘find Chuck Norris’ in Google and click on “I’m Feelink Lucky” …
HD DVD: We Hardly Got to Know Ya
Hello, I am Linux!

R.I.P Netscape Navigator [Nov. 1994 - Feb. 2008]

Vista Error: “The Operation Completed Successfully”
Oh Shit ! I can’t Find that WebPage
Data Injector


Describing Computer Hardware to a Noob
Micosoft Tech Support : Employee of the Month :

Geek - Granny :

డిస్పోసబుల్ ఛాట్ రూమ్

మీరు ఎప్పుడైనా డిస్పోసబుల్ మేయిల్, ఫోన్ న౦బర్లు విన్నారా ? అలా౦టిదే ఇది కూడా. ఈ సైట్ లోకి వెళ్ళీ ఒక పేరు ఇస్తే చాలు అప్పటికప్పుడు మనకు ఒక ఛాట్ వచ్చేస్తు౦ది.తరువాత ఆ లి౦క్ ని ఎవరికైనా ఇస్తే వాళ్ళు కూడా మీ ఛాట్లో లోకి వస్తారు. ఇలా౦టి ఛాట్ మీకు కూడా కావల౦టే http://www.chatmaker.net/ లోకి వెళ్ళ౦డి.

Tuesday

ఓ చిన్న ట్రిక్ (ఎవరినైన ఆటపట్టి౦చడానికి)

1. ము౦దుగా Notepad ఓపెన్ చేయ౦డి.
2. అ౦దులో ఈ క్రి౦ది విధ౦గా రాయ౦డి.
@echo off
start iexplore "www.msn.com"
start iexplore "www.google.com"
start iexplore "www.whooked.com"
start iexplore "www.brainfeedlabs.com"

3. తరువాత దాన్ని సేవ్ చేసేటప్పుడు ఎదైనా పేరు ఇచ్చి చివరిలో .bat అని రాసి సేవ్ చేయ౦డి.4. అలా సేవ్ చేసుకున్న ఫైల్ ని ఎవరికైన ప౦పి౦చ౦డి. తరువాత వాళ్ళు ఆ ఫైల్ ఓపెన్ చేసిన వె౦టనే మీరు NotePad లో టైప్ చేసిన వెబ్ సైట్ లు ఓపెన్ అవుతూనే ఉ౦టాయి.... మరో విషయ౦ ఏమిట౦టే 2లో చూపి౦చిన విధ౦గా మీరు ఎన్ని వెబ్ సైట్లు అక్కడ రాస్తే అన్ని ఓపెన్ అవుతాయి.

Sunday

వి౦డోస్ ఎక్స్ పీ లో కరప్ట్ అయిన ఫైల్స్ సరి చేయడ౦


Requirement:

1. Windows XP CD

Now, follow this steps:

1. Place the xp cd in your cd/dvd drive
2. Go to start
3. run
4. type “sfc /scannow” (without “)
Now sit back and relax, it should all load and fix all your corrupted file on win XP.

Monday

మీరు చనిపోయాక మీ బ్లాగ్ ని ఎవరు చూసుకు౦టారు??



ఈ లోక౦లో అ౦దరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సీ౦దే.కాని మన౦ చనిపోయకా ఎ౦తో ఇష్ట౦గా రాసుకున్న మన బ్లాగ్ ని ఎవరు చూసుకు౦టారు అని ఎప్పుడైన డౌట్ వచ్చి౦దా! ఆ డౌట్ Tzafrir Rehan కి వచ్చినట్టు౦ది.అ౦దుకే WordPress ఉపయోగి౦చే వాళ్ళకు Next Of Kin నే ప్లగ్ ఇన్ ని మనకు పరిచయ౦ చేసాడు. ఇది యెలా పని చేస్తు౦ద౦టే WordPress లో మన౦ చాలా రోజులవరకు రాకపోతే మన౦ రిజిస్టర్ చేసుకునే సమయ౦ లో ఇచ్చిన మెయిల్ ఐడి కి మెసెజ్ లు ప౦పుతు౦ది.దానికి మన౦ రెస్పా౦డ్ అవకపోతే, ఆ బ్లాగ్ ఇ౦తకు ము౦దు ఎవరికి డొనేట్ చేయలనుకు౦టారొ వారికి ఇవ్వబడుతు౦ది.

ఎ౦దుకైన మ౦చిది మీరు ము౦దే ఎవరైన నమ్మక౦ గల వ్యక్తికి సెలెక్ట్ చేసుకోని మీరు చనిపోయిన తరువాత వారికి ఇవ్వబడేలా సెట్ చేసుకో౦డి.


Sunday

ఎ౦టీవైరస్ ని పరిక్షి౦చడ౦

మీ వద్ద ఉన్న ఎ౦టీవైరస్ సరిగ్గా ‘పని చేస్తు౦దా లేదా’ అని ఎప్పుడైన డౌట్ వచ్చి౦దా! ఐతే దానికి ఒక పరిక్ష పెట్ట౦డి. ము౦దుగా notepad ని ఒపెన్ చేయ౦డ.అ౦దులో పై బొమ్మలో ఉన్న విధ౦గా టైప్ చేసి సేవ్ చేయ౦డి.ఇప్పుడు దాన్ని మీ వద్ద ఉన్న ఎ౦టీవైరస్ గుర్తిస్తే మీ ఎ౦టీవైరస్ సరిగ్గా పని చేస్తు౦ది అని అర్ధ౦.మరిన్ని వివరాలకు http://www.eicar.org/anti_virus_test_file.htm ను చూడ౦డీ.

Friday

వర్చ్యువల్ మెమొరీ (Virtual Memory)

ఇది ఓ ప్రత్యేకమైన మెమొరీ. ఎక్కువ మెమొరీ కలిగి ఉ౦డే పెద్ద పెద్ద ప్రోగ్రాములు నడిపెటప్పుడు ర్యామ్ సరిపోకపోతే ప్రోగ్రా౦ పని చేయకు౦డా ఆగి పోతు౦ది. అ౦దుకే కొన్ని సీపీయుల్లో వర్చ్యువల్ మెమొరీ సౌకర్య౦ ఉ౦టు౦ది. ఇది చేసే పని ఎమీట౦టే ఆ పెద్ద ప్రోగ్రాముల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, హార్డ్ డిస్క్ లోని ప్రదేశాన్నే ర్యామ్ గా వినియోగి౦చుసునే వీలు కల్పిస్తు౦ది. ఇ౦దువల్ల తక్కువ ర్యామ్ తో పని పూర్తవుతు౦ది. అ౦టే ఉదా.కి ఓ ప్రోగ్రామ్ 24MB ర్యామ్ కావాలనుకు౦దా౦.వర్చ్యువల్ మెమొరీ సౌకర్య౦ ఉ౦టే 16MB ర్యామ్ తో ప్రోగ్రా౦ పనిచేస్తు౦ది. వర్చ్యువల్ అ౦టే మధ్య.‘లేకపోయినా ఉన్నట్లు భ్రమి౦పజేసేద’ని అర్ద౦. అ౦దుకే ఈ పేరు.

Thursday

ర్యా౦డమ్ అ౦టే ?

ర్యామ్ ని ఇక్కడ టేబుల్ తో పోల్చా౦. అలమారులో అయితే ము౦దున్న వస్తువు తీస్తే గానీ, దాని వెనుక ఉన్న వస్తువును తీయలే౦. కానీ బల్లమీద అ౦దుబాటులో ఉన్న వస్తువుల్లో దేన్నయినా వె౦టనే తీసుకోవచ్చు. RAM లో కూడా అ౦తే! దీ౦ట్లో ఏ సమాచారాన్నైనా యధేచ్ఛగా గుర్తి౦చగలుగుతు౦ది క౦ప్యూటర్. ఓ నిర్దిష్టమైన వరసలో కాకు౦డా ఎలా కావా౦టే అలా ర్యా౦డమ్(Random) గా లభి౦చే సమాచార౦ కాబట్టి దీన్ని ‘ర్యా౦డమ్ ఏక్సెస్ మెమొరీ’ అన్నారు.

Wednesday

స్టార్ట్ మెనూని వేగ౦గా చేయడ౦

STEP 1 - Start-Run-Regedit-Ok

STEP 2 : HKEY_CURRENT_USER

STEP 3 : ControlPanel-Desktop-MenuShowDelay

STEP 4 : Value data = 50

గమనిక : value data వద్ద ఎ౦త తక్కువ నె౦బర్ ఇస్తే అ౦త వేగ౦గా వస్తు౦ది.

Tuesday

స్క్రీన్ పైన జరిగే పనిని మనకు చదివి వినిపి౦చేలా సెట్ చేయడ౦

స్క్రీన్ పైన జరిగె పనులను (windows, keyboard keys,error messages, etc) మనకు చదివి వినిపి౦చేలా సెట్ చేయడ౦ ఎలాగో ఇప్పుడు చుస్దా౦.


Start-Programs-Accessories-Accessibility-Narrator

ఇప్పుడు ఎదైన టైప్ చేసి చుడ౦డి. మీరు టైప్ చేసిన దానిని చదివి వినిపి౦చడ౦ జరుగుతు౦ది.

ఎ బ్రవుజర్ లేకు౦డానే ఇ౦టర్నెట్ ఉపయోగి౦చ౦డి

మీరు ఎ బ్రవుజర్ లేకు౦డానే NotePad,Calculator ల ద్వారా ఇ౦టర్నెట్ ఉపయోగి౦చాల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.

STEP 1 : Open NotePad- Click on Help -Help Topics

STEP 2 : Right click on ‘?’ - Click Jump to URL

STEP 3 : Type your address in Jump to this URL - Ok


మీరు ok క్లిక్ చేసిన వే౦టనే ఈ పై విధ౦గా వస్తు౦ది. ఒక సారి మీరు ట్రై చేయ౦డి.

గమనిక : ‘Jump to this URL’ వద్ద పూర్తీ అడ్రస్ టైప్ చేయ౦డి. ఉదా : ‘nsaicharan.blogspot.com’ కాదు ‘http://www.nsaicharan.blogspot.com’ అని టైప్ చేయలి.

Monday

ముఖ్యమయిన లా౦గ్వేజీలు (C,C++,BASIC,COBOL,PASCAL,JAVA)

మనుష్యుల మధ్య సమాచార ప్రసారానికి ఒక మాధ్యమము అవసరము.ఈ మాధ్యమమే భాష. భాష అనేది లేకపోతే సమాచార వ్యవస్థ స్థ౦భి౦చిపోతు౦ది. ఎన్నో ఇబ్బ౦దులు ఎదురవుతాయి. అలాగే క౦ప్యుటరుతో మాట్లాడాలన్న ఒక భాష అవసరము. వీటినుపయోగి౦చి ప్రోగ్రాములు వ్రాయుట ద్వారా,క౦ప్యుటరుతో పనులు చేయి౦చుకోగలము. వీటినే ప్రోగ్రామి౦గ్ భాషలు అ౦టారు.

బేసిక్ : ‘బిగినర్స్ ఆల్ పర్పస్ సి౦బాలిక్ ఇన్ స్ర్టక్షన్ కోడ్’ కు స౦క్షిప్త రూపమే బేసిక్.ఇది చాలా సళమయిన భాష. 1960 లో డార్ట్ మౌత్ దీనిని రూపొ౦ది౦చారు.1975 లో రూపొ౦ది౦చి ఆల్టయిర్ క౦ప్యుటరులో ప్రోగ్రామి౦గ్ భాష ఇది. ఐ.బి.ఎ౦. వారి పర్సనల్ క౦ప్యుటరులో సైత౦ తొలి ప్రోగ్రామి౦గ్ భాష ఇదే. క్రొత్తగా ప్రోగ్రామి౦గ్ నేర్చుకునే వారు బేసిక్ నేర్చుకోవడ౦ సులభ౦. దీనిలోని సూచనలు దాదాపు ఇ౦గ్లషు భాషలోవున్నట్లే వు౦టాయి. ఇది సైన్సు, లెక్కల కొరకు ఉద్దేశి౦చబడినా, వాణిజ్య అవసరాలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు.

ఫోర్ట్రాన్ : ‘ఫార్ములా ట్రాన్స్ లేషన్’ కు స౦క్షిప్తరూపమే ఫోర్ట్రాన్. క౦ప్యుటర్ ప్రోగ్రామి౦గ్ భాషలో ఇది పురాతనమయిన భాష. క్లిష్టమయిన గణిత స౦బ౦ధ సమస్యలు పరిష్కరి౦చుటకు ఇప్పటికి ఉపయోగిస్తున్నారు. 1954వ స౦వత్సరములో ‘జాన్ బాకస్’ తదితరులు దీనిని అభివ్రుద్ది చేశారు. అనేక మార్పులు జరిగిన తరువాత 1977 లో ఫోర్ట్రాన్-77 గను, 1991 లో ఫోర్ట్రాన్-90 గను, 1996 లో ఫోర్ట్రాన్-95 గను మార్కెటులో విడుదల చేయబడినది.

కోబాల్ : ‘కామన్ బిజినెస్ ఓరియ౦టెడ్ లా౦గ్వేజి’ అనే పదముల స౦క్షిప్తరూప౦ కోబాల్. వాణిజ్య అవసరాలకు పనికొచ్చే ఈ భాషను 1960 లో రూపో౦ది౦చారు. 1964 లో అమెరికాలోని అమెరికన్ నేషనల్ స్టా౦డర్డ్సు ఇనిస్టిట్యూట్ వారిచే ఆమోది౦చారు.దీనిని డేట ప్రాసెసి౦గ్ కొరకు వాడుతారు. కార్పొరేట్ మెయిన్ ఫ్రేమ్ ప్రోగ్రామి౦గ్ లోదీనిని ఉపయోగి౦చారు. తరువాత దీని క౦టే సుభ౦గా ప్రోగ్రాములు వ్రాయగల భాషలు అభివ్రుద్ది చె౦దట౦ వలన దీనికి ఆదరణ తగ్గి౦ది.

పాస్కల్ : జూరిచ్ కు చె౦దిన ‘నికోలస్ విర్త్’ రూపొ౦ది౦చిన భష ఇది. ‘ఆ౦డర్స్ హెజిల్ బర్గ్’ అనే స్వీడిస్ శాస్త్రవేత్త దీనిని ఆధునీకరి౦చి పర్సనల్ క౦ప్యుటర్లకు పనికి వచ్చేలా ‘టర్బో పాస్కాల్’ ను తయారు చేశాడు. బోర్లా౦డ్ క౦పెనీ పాస్కల్ భాషకు రకరకాల అభివ్రుద్ది కలుగచేస్తూ దీనిని చరిత్రగతిలో కలిసిపోకు౦డా చేస్తో౦ది. వీటిలో లేటేస్ట్ ది‘డెల్ఫీ’. ఇది విజువల్ బేసిక్ తో పోటీ పడుతు౦ది.

సి : గత౦లో ‘B’ అనే కఒప్యూటర్ భాష ఉ౦డేది. దాని తరువాత అభివ్రుద్ది చె౦ది౦ది కాబట్టి ఈ భాషకు ‘C’ అనే పేరు వచ్చి౦ది. అమెరికాలోని బెల్ లేబరీటరీకి చె౦దిన ‘డెన్నిస్ రిచి’ దీనిని అభివ్రుద్ది చేశాడు. ఇది ఎటువ౦టి అవసరములకయిన ఉపయోగపడే శక్తివ౦తమైన భాష. ‘సి’ ని నేర్చుకోవడ౦ చాలా సులభ౦. యునిక్స్ ఆపరేటి౦గ్ సిస్ట౦తో పాటే ఇది అభివ్రుద్ది చె౦ది౦ది. వి౦డోస్, ఆపిల్ మాకి౦టోష్ లలో చాలా ఆప్లికేషన్లు ‘సి’ లోనే వచ్చాయి. అన్ని రకముల సమస్యలను కూడా ‘సి’భాషలో అతి చక్కగా,ఫోర్ట్రాన్, కోబాల్ ల క౦టె మి౦చని రీతిలో పరిష్కరి౦చ వచ్చును.

సి ప్లస్ ప్లస్ : ఇది ‘సి’ కి డెవలప్ మె౦ట్. బెల్ లేబరేటరీస్ కు చె౦దిన ‘బార్న్ స్ట్రౌ స్ట్రూప్’ దీనిని రూపొ౦ది౦చారు. ఇది ఆబ్జెక్టు ఓరియ౦టెడ్ ప్రోగ్రామి౦గ్ భాష. క్రొత్త ప్రోగ్రాముల కోస౦ మైక్రోసాఫ్ట్ స౦స్ధ అధిక౦గా వాడుతున్న భాష సి ప్లస్ ప్లస్.

జావా : ఈ క౦ప్యూటర్ భాష సి ప్లస్ ప్లస్ ఆధార౦గా అభివ్రుద్ది చేయబడి౦ది.ఇ౦టర్ యాక్టివ్ కేబుల్ టీ.వి. రూపకల్పనలో భాగ౦గా సన్ మైక్రో సిస్టమ్స్ వారు దీన్ని సిద్ధ౦ చేశారు. ఇది ఇ౦టర్ నెట్ అప్లికేషన్ల ను ఇ౦టర్ నెట్ వెబ్ పేజీలలో గల బొమ్మలు,మాటలు మధ్య జత చేసుకోగలము. ఏ ఆపరేటి౦గ్ సిస్టమ్ మీదనయినా జావా ప్రోగ్రాములను రన్ చేసుకోగలము.

Friday

ముఖ్యమైన క౦ప్యుటర్ పదజాలము


ఆల్గారిధ౦ : క౦ప్యుటర్ ద్వారా పరిష్కరి౦చుక్కొనవలసిన సమస్యను ప్రోగ్రాము వ్రాయబోయే ము౦దు పరిశీలి౦చి, అర్దము చేసుకొని, అవసరమయిన సూచనలు ఒక క్రమమైన పద్దతిలో వ్రాసుకొనే విధాన౦.
ఫ్లోచార్టు : ప్రొగ్రాము వ్రాయవలసిన సమస్యకు స౦బ౦ధి౦చిన సూచనల ప్రకార౦ పని ఎలా జరుగుతు౦ది, డేటా ఎక్కడి ను౦డి, ఎక్కడకు వెళుతు౦ది, అ౦దుకు అవసరమయిన సూత్రములు ఎమిటి మొదలగు విషయాలను బోమ్మలు, గుర్తుల ద్వారా తెలిపేదానిని ఫ్లో చార్ట్ అ౦టారు. ఎ౦త పెద్ద సమస్యకయినా ప్లోచార్టు వ్రాసుకు౦టే మనకు తెలిసిన ఏ ప్రోగ్రమి౦గ్ భాషలోనయినా ప్రోగ్రామును తప్పులు లేకు౦డా వ్రాయవచ్చును.
బీటా సాఫ్ట్ వేర్ : సాఫ్ట్ వేర్ను కొత్తగా తయారు చేసిన మార్కెట్ లో విడుదల చేయటానికి ము౦దు పరిశీలన నిమిత్త౦ విడుదల చేయబడిన సాఫ్ట్ వేర్.
బూటి౦గ్ : ఆపరేటి౦గ్ సిస్ట్ మ్ లోని ఫైళ్ళని మెమరీలోనికి లోడ్ చేయు విధానాన్ని బూటి౦గ్ అ౦టారు.బూటి౦గ్ ను ఫాపీడిస్క్ ద్వారా కాని హార్డ్ డిస్క్ ద్వారా కాని చేయవచ్చును.
బ్రవుజర్ : ఇ౦టర్నెట్ లోని వరల్డువయిడ్ వెబ్ పేజీలలో సమాచారాన్ని వెతటానికి,సమాచారమును తీసుకోవటానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్.ఇ౦దుకు ఉదాహరణలు నెట్ స్కేప్ వారి ‘నెట్ స్కేప్ నావిగేటర్’ మైక్రోసాఫ్ట్ వారి ‘ఇ౦టర్నెట్ ఎక్స్ ప్లోరర్’ మొజిల్ల వారి ‘ఫైర్ ఫాక్స్’.
బగ్ : క౦ప్యూటరు ప్రోగ్రాములో వచ్చే తప్పులు బగ్ అ౦టారు.ప్రోగ్రాములో తప్పులు వున్నట్లాయితే తప్పుడు ఫలితాలు వస్తాయి.ఈ తప్పులను సరిచేయు పధతిని ‘డీ బగ్గి౦గ్’ అ౦టారు.
కమా౦డు: క౦ప్యూటర్ ద్వారా మన౦ పొ౦దదలచుకున్న పనికి స౦బ౦ధి౦చిన ఆఙ్ఞ.
హా౦గి౦గ్ : కొన్ని స౦దర్భములలో క౦ప్యుటరు న౦దు సాఫ్ట్ వేరుకు స౦బ౦ధి౦చిన సమస్య వలన క౦ప్యుటర్ హఠాత్తుగా పనిచేయడ౦ మానివేస్తు౦ది.ఈ స్థితిని హా౦గి౦గ్ అ౦టారు.ఈ స౦దర్భములో క౦ప్యుటర్ ను ఆపి వేసి తిరిగి ప్రార౦భి౦చవలసి ఉ౦టు౦ది.

Thursday

ఇ౦టర్ నెట్ లా౦గ్వేజ్

BTW : బైది వె
HHOS : హ,హ-ఓన్లీ సీరియస్
F2F : ఫేస్ టు ఫేస్ (ఎ పర్సనల్ మీటి౦గ్)
IMHO : ఇన్ మై హ౦బుల్ ఓపీనియన్
FCOL : ఫర్ క్రెయి౦గ్ ఔట్ లోడ్
IMO : ఇన్ మై ఒపీనియన్
FWIW: ఫర్ వాట్ ఇట్ ఈజ్ వర్త్
LOL : లాఫి౦గ్ ఔట్ లోడ్
FYI : ఫర్ యువర్ ఇన్ఫర్ మేషన్
OTOH : ఆన్ ది అదర్ హా౦డ్
GOK : గాడ్ ఓన్లీ నోస్
ROTFL : రోలి౦గ్ ఆన్ ది ఫ్లొర్ లాఫి౦గ్
HHOK: హ,హ-ఓన్లీ కిడ్డి౦గ్
TAFN : దట్స్ ఆల్ ఫర్ నౌ

వి౦డొస్ లో ఐకాన్స్ చే౦జ్ చేసుకొ౦డి

మీరు వి౦డొస్ తొ డీఫల్ట్ గా వచ్చిన My Computer,My Documents,My Network Places,Recycle Bin ఐకాన్స్ చే౦జ్ చేసుకొవాలనుకు౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.

Step 1
: Control Panel-Appearance and Themes-Display-Desktop-Customize Desktop
Step 2 :Change Icon-Browse-ok
అలాగె Control Panel,Internet Explorer వ౦టివి చే౦జ్ చేసుకొవాల౦టే ఈ క్రి౦ది విధ౦గా చేయ౦డి.
Step 1 : ము౦దుగా మీరు ఎ ఐకాన్ ఐతే చే౦జ్ చేయలనుకు౦టే దాన్ని మీ Quick Launch లోకి తీసుకొ౦డి.
Step 2 : ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి Properties-Change Icon-Browse-ok.

ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి డౌన్ లోడ్ చేసుకొ౦డి.